ఒక సమయంలో నన్ను తిట్టారు...నా పని ఐపోయింది అని వెక్కిరించారు
on May 15, 2023

"దసరా" మూవీలో వెన్నెల చేసే తీన్ మార్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈటీవీలో మదర్స్ డే సందర్భంగా "ప్రియమైన నీకు" షోలో ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన జిత్తు మాస్టర్ వర్షతో కలిసి డాన్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. ఈ సాంగ్ ఒక్కో స్టెప్ కి ఒక్కో అర్ధం ఉందని కూడా వాటి గురించి వివరించి చెప్పాడు. " కొరియోగ్రాఫర్ కాకముందు మీ జర్నీ, స్ట్రగుల్స్ గురించి చెప్పండి" అని విష్ణుప్రియ అడిగింది. "మాష్టర్ ఐపోయిన వెంటనే అవకాశాలు రావు.. నేను ఎప్పటికైనా కొరియోగ్రాఫర్ ని అవుతాను అనే నమ్మకం నాకు ఉండేది. ఛాన్సెస్ కోసం చాలాచోట్లకు తిరిగాను. వస్తాయి అనుకున్న ఛాన్సులు ఏడేళ్ల వరకు రాలేదు.
ఆ ఏడేళ్లు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను...నేను కొరియోగ్రాఫర్ అవడం బాగుంది అన్నవాళ్ళు కూడా ఎందుకు అంత తొందరగా కొరియోగ్రాఫర్ వి అయ్యావు అన్నారు. గర్వం ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చాలా మంది అన్నారు. ఏ ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లిన, డైరెక్టర్ దగ్గరకు వెళ్లిన నువ్వేం చేసావ్ అని అడుగుతారు. అందుకు ఒక డెమో చేయాలనీ అనుకున్నా. దాని కోసం కొంచెం కొంచెం డబ్బు దాచుకోవడం మొదలుపెట్టా. డెమో చేద్దాం అనుకునే టైంకి మా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ డబ్బు అక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ నేను ఒక మూడేళ్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నా పని ఐపోయింది. ఇంకా వీడు పడిపోయాడు అని చాలా మంది అనుకున్నారు. కరెక్ట్ గా అదే టైంలో ఢీలో ఎంట్రీ ఇచ్చాను. ఒక్క సాంగ్ తో మళ్ళీ లేచి నిలబడ్డాను. పడిపోయాను అనుకున్నవాళ్లంతా మళ్ళీ నా దగ్గరకు రావడం మొదలయ్యింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. సినిమా మాష్టర్ అయ్యి మళ్ళీ టీవీ షోస్ ఏమిటి అని అడిగారు...ఎక్కడైతే ఏముంది నేనేంటో చూపించుకోవడం నాకు ఇంపార్టెంట్ అని చెప్పా. నాకు అలాంటి గోల్డెన్ అవకాశాన్ని ఢీ ఇచ్చింది.
ఎవరైతే నన్ను వెక్కిరించారో వాళ్లకు కూడా దొరకలేదు ఆ స్టేజి. ఛాన్స్ ఎప్పుడొస్తుంది అని ఎదురుచూస్తున్న నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ ఒకరోజు ఫోన్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రంగ్ దే హీరో నితిన్ వస్తున్నారు..ఆయన పెర్ఫార్మ్ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపోజ్ చేయాలి..అదిరిపోవాలి నీకే ఛాన్స్ రావాలి అని ఏ నోటితో అన్నాడో అది నిజమయ్యింది. ఇప్పుడు నాకు అన్ని అవకాశాలు వచ్చి ఈరోజు ఈ స్టేజి మీద నిలబడ్డాను. నితిన్ గారికి నా కోరియోగ్రఫీ నచ్చి నెక్స్ట్ మూవీకి సాంగ్ చేద్దాం అని చెప్పారు. నాకు ఛాన్స్ ఇచ్చిన నా దేవుడు నితిన్ గారు. దసరా మూవీ ఆఫర్ రావడం నాకు మరో టర్నింగ్ పాయింట్." అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



